Hyderabad News: మధ్యవర్తిత్వం వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది: కేసీఆర్‌

హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ

Updated : 04 Dec 2021 14:22 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం రావడం సంతోషమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఆయన ధన్యవాదాలు అని తెలిపారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్‌ చెప్పారు. నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి హైదరాబాద్‌ అన్ని విధాలా అనువైన ప్రాంతమని కేసీఆర్‌ వివరించారు. ఏఐఎంసీ కోసం 25వేల చ.అడుగులు కేటాయించామని చెప్పారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమి కేటాయిస్తామని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు