CJI: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ

పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు.

Updated : 04 Dec 2021 19:15 IST

హైదరాబాద్‌: పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారాలు అవుతాయని తెలిపారు. నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీఎం కేసీఆర్‌తో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘కోర్టులకు వచ్చే ముందు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉంది. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతోంది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక. సాధ్యమైనంత వరకు మహిళలు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి. విస్తృత సంప్రదింపులతో ఇరు పక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సాధ్యం’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని