logo

‘సిలికానాంధ్ర’కు గుర్తింపు

భారతదేశం వెలుపల అమెరికా గడ్డపై మొదటిసారి భారతీయ కళలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం’కు

Published : 05 Dec 2021 01:50 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: భారతదేశం వెలుపల అమెరికా గడ్డపై మొదటిసారి భారతీయ కళలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం’కు ప్రతిష్ఠాత్మక ‘వాస్క్‌ సీరియర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ కమిషన్‌(డబ్ల్యూఎస్‌సీయూసీ)’ గుర్తింపు లభించిందని సిలికానాంధ్ర (కాలిఫోర్నియా-యూఎస్‌ఏ) విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయంలో ఇప్పుడు మరిన్ని విభాగాలను ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగీత శాస్త్రవేత్త, వర్సిటీ బోర్డు సభ్యుడు పప్పు వేణుగోపాల్‌రావు, వర్సిటీ అధికారి జ్యోతి చింతలపూడి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని