logo

కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ.. పలు నిర్ణయాలకు ఆమోదం

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. దిల్లీలో

Published : 06 Dec 2021 22:29 IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. దిల్లీలో వరి నిరసన దీక్ష అక్కర్లేదని పీఏసీలో ఎక్కువ శాతం మంది నేతలు అభిప్రాయపడ్డారు. పసుపు, మిర్చిపై దిల్లీ స్థాయిలో నిరసనలు తెలపాలని కొంత మంది నాయకులు సూచించారు.

కమిటీ తీసుకున్న మరిన్ని నిర్ణయాలివే..

* పంటల వారీగా రైతుల సమస్యలపై అధ్యయనానికి సీనియర్లతో కమిటీ ఏర్పాటు. కోదండరెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నివేదిక సిద్ధం చేయాలి.

* వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యయనం. ఇందుకోసం ఛత్తీస్‌గఢ్‌కు కిసాన్‌ కాంగ్రెస్‌ బృందం వెళ్లనుంది.

* ఛత్తీస్‌గఢ్‌లో చిరుధాన్యాల సాగుపై కమిటీ అధ్యయనం చేయాలి.

* టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఈనెల 10న క్రమశిక్షణ కమిటీ భేటీ.

* పార్టీ సభ్యత్వంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని