logo

దివ్యాంగులకు మంచ్‌ చేయూత

పట్టణంలోని మార్వాడీ యువమంచ్‌ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు, క్యాలీపర్స్‌ ఉచిత శిబిరాన్ని మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు లలిత్‌జైన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలి

Published : 07 Dec 2021 01:22 IST

ఉచిత శిబిరానికి విశేష స్పందన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ప్రతినిధులు

తాండూరు టౌన్‌  (న్యూస్‌టుడే): పట్టణంలోని మార్వాడీ యువమంచ్‌ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు, క్యాలీపర్స్‌ ఉచిత శిబిరాన్ని మంచ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు లలిత్‌జైన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు ఉంటుందని, మొదటి రోజు 114 మంది పేర్లు నమోదు చేసుకున్నారని వారి కాళ్లు, చేతుల కొలత తీసుకున్నామని ప్రతినిధులు తెలిపారు. అనంతరం కొలతల ఆధారంగా కృత్రిమ కాళ్లు, క్యాలీపర్స్‌ను అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంతో పాటు హైదరాబాద్‌, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, వనపర్తి, మహబూబ్‌నగర్‌, పరిగి, అచ్చంపేట, కర్ణాటక చించోళీ, బీదర్‌ తదితర ప్రాంతాల నుంచి బాధితులు వచ్చారు. వారికి శిబిరం వద్దే ఉదయం అల్పహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.రాజస్థాన్‌లోని జైపూర్‌ నిపుణులతో కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలీపర్స్‌ తయారు చేయించి ఉచితంగా అందజేస్తామని తెలిపారు. శిబిరాన్ని డీఎస్పీ లక్ష్మీనారాయణ సందర్శించి ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో మంచ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌ జైన్‌, తాండూరు ప్రగతి సమాజ్‌ అధ్యక్షుడు రమేష్‌ చంద్ర పండిత్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు మన్‌మోహన్‌ సార్డా, స్థానిక ప్రతినిధులు మహేష్‌, రోహిత్‌, శ్రీకాంత్‌ పండిత్‌, అనిల్‌ సార్డా, సన్ని అగర్వాల్‌, గోవింద్‌, కిషన్‌ రాఠీ తదితరులు పాల్గొన్నారు.

శిబిరానికి వచ్చిన దివ్యాంగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని