logo

ఆకలి తీర్చారు.. అద్భుత చర్చి నిర్మించారు

మెదక్‌ జిల్లా పేరెత్తగానే వెంటనే గుర్తుకు వచ్చేది మెదక్‌ కెథడ్రల్‌ చర్చి. ఈ అపురూప కట్టడానికి ఉన్న ఘనత, ప్రత్యేకత అలాంటింది. మదిదోచే సమున్నత నిర్మాణ విశేషాలెన్నింటినో కలిగి, చూపరులను మంత్రముగ్ధులను చేసే

Published : 07 Dec 2021 01:22 IST

నేడు చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ జయంతి

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా పేరెత్తగానే వెంటనే గుర్తుకు వచ్చేది మెదక్‌ కెథడ్రల్‌ చర్చి. ఈ అపురూప కట్టడానికి ఉన్న ఘనత, ప్రత్యేకత అలాంటింది. మదిదోచే సమున్నత నిర్మాణ విశేషాలెన్నింటినో కలిగి, చూపరులను మంత్రముగ్ధులను చేసే మెదక్‌ చర్చి సృష్టికర్త ఛార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ జయంతి నేడు.  శతాబ్దం క్రితం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆకలిదప్పులతో అల్లాడుతున్న వారిని ఆదుకునే సదుద్దేశం, దేవుడికి సమున్నతమైన మందిరం నిర్మించాలన్న సంకల్పంతో ఆనాడు ఫాస్నెట్‌ ఊరికే కూర్చుండలేదు. ఈ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఇబ్బందులకు ఓర్చి నిర్మించిన ఈ చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి సుందరమైన నిర్మాణంగా వినుతికెక్కింది. కరుణామయుడి కోవెలగా, పేదల పెన్నిధిగా, మెదక్‌ మహా దేవాలయంగా పేరొందింది. చర్చిని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచేకాక విదేశీయులు సైతం తరలివస్తుండటం విశేషం. ఆయన జయంతి పురస్కరించుకుని నేడు చర్చిలో గురువులు, కమిటీ బాధ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని