logo

వంతెనను ఢీకొట్టి కాలువలో పడ్డారు

ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ వంతెన(కల్వర్టు)ను ఢీకొట్టి కాలువలో పడటంతో తల్లి మృతి చెందగా కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలోని వల్లభాపూర్‌

Published : 07 Dec 2021 01:22 IST

తల్లి దుర్మరణం, కుమారుడికి తీవ్ర గాయాలు

నార్సింగి (చేగుంట), న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ వంతెన(కల్వర్టు)ను ఢీకొట్టి కాలువలో పడటంతో తల్లి మృతి చెందగా కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలోని వల్లభాపూర్‌ వద్ద సోమవారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ నాగరాణి తెలిపిన వివరాలు... చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీకి చెందిన తల్లి ఉప్పు శాంతమ్మ (48), కోడలును తీసుకు వచ్చేందుకు కొడుకు రాజు కలిసి ద్విచక్ర వాహనంపై రామాయంపేట మండలం కోమటిపల్లికి బయలుదేరారు. అతివేగంగా వెళ్తూ వల్లభాపూర్‌ శివారులోకి రాగానే 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి వాహనంతో సహా కాలువలో పడిపోయారు. తీవ్రమైన గాయాలు కావడంతో శాంతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. రాజు సైతం తీవ్ర గాయాల పాలవడంతో వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి అంబులెన్స్‌లో నార్సింగిలో ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని