logo

రాష్ట్రంలో దళితబంధు అమలు ఎక్కడ?

దళితుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దళితబంధు పథకం అమలు విషయంలో స్పష్టమవుతోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా

Published : 07 Dec 2021 02:39 IST

అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్న  కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: దళితుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దళితబంధు పథకం అమలు విషయంలో స్పష్టమవుతోందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బాబాసాహేబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికల పేరుతో నిలిపివేసిన దళితబంధును తర్వాత ఎందుకు తిరిగి ప్రారంభించలేదని ప్రశ్నించారు.  
విగ్రహం ఇప్పటికీ ఠాణాకే పరిమితమైంది: వీహెచ్‌
ఖైరతాబాద్‌లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహం ఉన్నప్పుడు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎందుకు పెట్టకూడదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. రూ.5 లక్షలు వెచ్చించి అంబేడ్కర్‌ విగ్రహాన్ని తెప్పిస్తే, దాన్ని పోలీస్‌స్టేషన్‌కే పరిమితం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం కొరవడింది: చాడ వెంకట్‌రెడ్డి
కేంద్రంలో మోదీ ప్రభుత్వ తీరు వల్ల సామాజిక న్యాయం జరగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు