logo

శుభ్రత మా తంతు.. మాస్కు మీ వంతు

దేశంలో అక్కడక్కడ కరోనా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో వైరస్‌ నిరోధానికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ

Published : 07 Dec 2021 02:38 IST

బస్సులో ద్రావణం పిచికారీ చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అక్కడక్కడ కరోనా ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో వైరస్‌ నిరోధానికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి బస్సును ద్రావణంతో శుభ్రం చేశాకే  పంపుతున్నామని, సిబ్బంది విధులు మారే సమయంలోనూ లోపల ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామన్నారు. బస్సుల్లో విధిగా శానిటైజర్‌ పెడుతున్నామని తెలిపారు. స్వీయ భద్రత దృష్ట్యా ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బస్సులోకి ఎక్కనివ్వమని స్పష్టం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని