KTR: టాటా-లాక్‌హిడ్‌ భాగస్వామ్యం శుభపరిణామం: కేటీఆర్‌

టాటా-లాక్‌హిడ్‌ మార్టిన్‌ భాగస్వామ్యం శుభపరిణామమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు ఆదిభట్లలో

Updated : 07 Dec 2021 15:28 IST

హైదరాబాద్‌: టాటా-లాక్‌హిడ్‌ మార్టిన్‌ భాగస్వామ్యం శుభపరిణామమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారు ఆదిభట్లలో టాటా ఏరోస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఫైటర్‌ వింగ్స్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ గత ఐదేళ్లలో పారిశ్రామికంగా రాష్ట్రం మంచి అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఏరోస్పేస్‌ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అవార్డు ఇచ్చిందని గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని