TS News: తెలంగాణలో రూపాయికి కిలో బియ్యం రద్దు చేస్తారా?: కిషన్‌రెడ్డి

తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయట్లేదంటే రూపాయికి కిలో బియ్యం రద్దు చేయడమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

Published : 08 Dec 2021 01:38 IST

దిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయట్లేదంటే రూపాయికి కిలో బియ్యం రద్దు చేయడమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలంటే రాష్ట్రం ధాన్యం సేకరించాల్సిందేనని స్పష్టం చేశారు.  బాయిల్డ్‌ రైస్‌ విషయంలో కేంద్రానికి కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. కేంద్రం రా రైసు కొనుగోలు చేస్తుంది... కొనుగోలు చేయం అని ఎప్పుడైనా చెప్పిందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెరాస నేతలు భాజపాపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓటమి పాలైన తర్వాత నుంచే తెరాస గందరగోళం చేస్తోందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని