logo

దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కీలకం

దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంగళవారం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో జియోస్పేషియల్‌ వరల్డ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన

Published : 08 Dec 2021 03:07 IST


మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై

మాదాపూర్‌, న్యూస్‌టుడే: దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంగళవారం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో జియోస్పేషియల్‌ వరల్డ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జియోస్మార్ట్‌ ఇండియా 2021 సదస్సును గవర్నర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.  ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా, రక్షణ వంటి వివిధ రంగాల్లో జియోస్పేషియల్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కరోనా కష్టకాలంలో మారుమూల ప్రాంత ప్రజలకు ఆహారం, ఔషధాలను అందించేందుకు ఈ పరిజ్ఞానం ఎంతో దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో జియోస్పేషియల్‌ వరల్డ్‌ సంస్థ సీఈవో సంజయ్‌కుమార్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ డా.శైలేష్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు