logo

బీసీ కుల గణనపై అఖిలపక్ష సమావేశం దిల్లీలో 10న

బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌పై ఈ నెల 10న దిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షతన రాజకీయ పార్టీల నేతలు, ప్రతినిధులతో  

Published : 08 Dec 2021 03:06 IST


సమావేశంలో అంజి, లాల్‌కృష్ణ, గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, వేణుమాధవ్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌పై ఈ నెల 10న దిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అధ్యక్షతన రాజకీయ పార్టీల నేతలు, ప్రతినిధులతో  అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. మంగళవారం కాచిగూడలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన వ్యతిరేక వైఖరితో ఉండడం బీసీలపై వివక్షేనని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లాల్‌కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని