logo
Published : 08/12/2021 03:06 IST

రేపట్నుంచి ఇంజినీరింగ్‌మొదటి ఏడాది తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావడంతో మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష పద్ధతిలో తరగతులు జరగనున్నాయి. రాష్ట్రంలో జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో ఈనెల 9 నుంచి మొదటి ఏడాది మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభించేందుకు వర్సిటీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈమేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. మొదటి ఏడాది తరగతులు వచ్చే ఏడాది అక్టోబరు 18 వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ షెడ్యూల్‌
* తొలుత ఈనెల 9 నుంచి 18 వరకు ఇండక్షన్‌ కార్యక్రమం జరగనుంది.

* మొదటి సెమిస్టర్‌ (1-1) మొదటివిడత తరగతులు ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఉంటాయి. అదేనెల 14-19 వరకు మొదటి మిడ్‌టర్మ్‌ పరీక్షలు జరుగుతాయి.

* ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్‌ 23 వరకు రెండోవిడత తరగతులుంటాయి. అదేనెల 25-30 వరకు రెండో మిడ్‌టర్మ్‌ పరీక్షలు జరుగుతాయి. మే 2-7 వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయి.

* మే 9-21 వరకు సెమిస్టర్‌ ముగింపు పరీక్షలు  

* రెండో సెమిస్టర్‌ (1-2) మొదటివిడత తరగతులు మే 23 నుంచి జులై 16 వరకు జరుగుతాయి. 18-23 వరకు మొదటి మిడ్‌టర్మ్‌ పరీక్షలు జరుగుతాయి.

* జులై 26 నుంచి సెప్టెంబరు 17 వరకు రెండోవిడత తరగతులు. 19-24 వరకు రెండో మిడ్‌టర్మ్‌ పరీక్షలు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 1 వరకు ప్రాక్టికల్స్‌. 3-18 వరకు సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయి.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని