logo

రోడ్డు ప్రమాదంలో యువ రైతు దుర్మరణం

తన పొలంలో పండించిన చిక్కుడు కాయను అమ్ముకుందామని వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ రైతు మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపిన వివరాలు.

Published : 09 Dec 2021 02:26 IST

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: తన పొలంలో పండించిన చిక్కుడు కాయను అమ్ముకుందామని వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ రైతు మృతి చెందాడు. చేతికి అందివచ్చిన కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపిన వివరాలు.. చిన్నకోడూరు మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన ఐరేని రాజిరెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు రాజు(27) చిక్కుడు కాయల బస్తాను ద్విచక్ర వాహనంపై వేసుకొని సిద్దిపేట రైతుబజార్‌లో విక్రయించేందుకు బుధవారం తెల్లవారుజామున బయలుదేరాడు. రామంచకు చేరగానే మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని కారు ఎదురుగా ఢీకొట్టి వెళ్లిపోయింది. రాజు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని