logo
Published : 09/12/2021 02:26 IST

విద్యుదాఘాతంతో కాపలాదారు...

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా నీళ్లు పడుతున్న కాపలాదారుకు విద్యుదాఘాతమై మృతి చెందాడు. ఈ ఘటన గజ్వేల్‌లో జరిగింది. సీఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌ గ్రామానికి చెందిన క్యాసారం మల్లయ్య (70) పట్టణం ఆదర్శనగర్‌ కాలనీలో ఓ వ్యాపారి వద్ద కాపలాదారుగా విధులు నిర్వహిస్తున్నాడు. నిర్మాణం జరుగుతున్న వ్యాపారి కొత్త ఇంటి వద్ద గోడలకు బుధవారం మల్లయ్య నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని