logo
Published : 09/12/2021 02:26 IST

చిన్నారి నాట్యం... ప్రశంసల పర్వం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

సాక్షిశివానంద్‌ సాధించిన ప్రశంసా పత్రాలు

తల్లి ప్రోత్సాహానికి చిన్నారి కూతురి ఉత్సాహం తోడైంది. కేవలం ఐదు సంవత్సరాల సాధనతోనే రాష్ట్ర స్థాయిలో రాణిస్తోంది. భరత నాట్యం, కూచిపుడిలో రాణిస్తున్న తాండూరుకు చెందిన సాక్షి శివానంద్‌పై ‘న్యూస్‌టుడే కథనం.

తన కూతురును నృత్య కళాకారిణిగా చూడాలన్నది తల్లి శివగంగ కోరిక. ఈ క్రమంలో మూడు సంవత్సరాల వయస్సులోనే కూతురును నటరాజ నృత్య శిక్షణ కేంద్రంలో చేర్పించారు. బుడిబుడి అడుగులు వేసే బాలికకు శిక్షకురాలు వాణి భరతనాట్యం, కూచిపుడి నేర్పించడం ప్రారంభించారు. తరచూ సాధన చేయించడంతో రెండేళ్లలో నృత్యంపై పట్టుసాధించేలా తీర్చిదిద్దారు. బాలిక మేనమామ తాండూరు అయ్యప్ప ఆలయ అర్చకులు కుమార్‌స్వామి వద్ద ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతూనే వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నృత్య ప్రదర్శనల్లో పాల్గొంటోంది.

● అక్టోబరులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని శ్రీ త్రిదండి చినజియర్‌స్వామి ఆశ్రమంలో 2వ ప్రపంచ కూచిపుడి నృత్య దినోత్సవం సందర్భంగా నిర్వహించి ప్రదర్శనలో ప్రతిభను చాటింది. వచ్చే ఏడాది ఛార్‌ధామ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హత సాధించింది.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని