logo

దేశ విద్యా రాజధానిగా హైదరాబాద్‌

ఐటీ, ఫార్మా రంగాల తరహాలోనే సమీప భవిష్యత్తులో దేశానికి విద్య రాజధానిగా హైదరాబాద్‌ నగరం మారనుందని రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ అన్నారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఉన్నత విద్యా మండలి, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో

Published : 09 Dec 2021 02:29 IST

సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌

సదస్సులో పాల్గొన్న వర్సిటీల ప్రతినిధులతో కమిషనర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ, ఫార్మా రంగాల తరహాలోనే సమీప భవిష్యత్తులో దేశానికి విద్య రాజధానిగా హైదరాబాద్‌ నగరం మారనుందని రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ అన్నారు. ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఉన్నత విద్యా మండలి, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని తాజ్‌బంజారాలో తెలంగాణ ఫ్యూచర్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌-2021 బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై నవీన్‌మిత్తల్‌ ప్రసంగించారు.
నాణ్యత లేని డిగ్రీ కళాశాలలకు కత్తెర... ‘‘రాష్ట్రంలో 1100కుపైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈసారి 50 కళాశాలల్లో జీరో అడ్మిషన్లు, మరో 250 కళాశాలల్లో 50కంటే తక్కువ.. వీటిలో నాణ్యత సాధ్యపడే వీల్లేని వాటన్నింటికి కత్తెర వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎంజీ వర్సిటీ పరిధిలో ఈ పని జరుగుతోంది. ఉన్నత విద్యామండలి సహకారంతో మిగిలిన వర్సిటీలు అందిపుచ్చుకోవాలి’ అని నవీన్‌మిత్తల్‌ చెప్పారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, కొత్త యూనివర్సిటీల చట్టం తీసుకొచ్చినట్లు చెప్పారు.
* రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ..హైబ్రీడ్‌ పద్ధతిలో బోధనకు ప్రాధాన్యం పెరగనుందన్నారు. టీసీఎస్‌ వంటి ప్రముఖ కంపెనీల సహకారంతో సిలబస్‌తయారీ, పరిశ్రమల నిర్వాహకుల బోధనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
* ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్‌ మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో నాణ్యత పెంపు బాధ్యత ఉన్నత విద్యామండలిపై ఉందన్నారు. ఆచార్యుల కొరత, నిధుల లేమితో పరిశోధనలపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, ఐఐటీ-హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, ఎంజీ వర్సిటీ వీసీ ప్రొ.సీహెచ్‌.గోపాల్‌రెడ్డి, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దక్షిణాది మండలి నిపుణుల కమిటీ ఛైర్మన్‌ జీబీకే రావు, ప్రాంతీయ విభాగాధిపతి మేడిశెట్టి నవీన్‌, కోల్‌కతా అడామస్‌ వర్సిటీ ఆచార్యుడు మహుల్‌ బ్రహ్మ, ఐఎస్‌బీ సీనియర్‌ అసోసియేట్‌ డీన్‌ చందన్‌చౌదరి, టాలెంట్‌స్ప్రింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జేఏ చౌదరి, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా, వెంకటేశ్వర కళాశాలల గ్రూపు డైరెక్టర్‌ మారంరాజు అజిత తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని