logo

ప్రమాదాలకు కారణమవుతున్నాయ్‌..!

‘ఎదురుగా వచ్చే వాహనం వెలుతురుకు రహదారి కన్పించడం లేదు కదా.. బండిని ఎలా నడుపుతున్నావ్‌’ అని తన డ్రైవర్‌ను కారు యజమాని అడిగారు. ‘డ్రైవింగ్‌ అలవాటు కదా.. అందాదగా నడుపుతున్నా’ అని అనడంతో అతని గుండెల్లో వణుకు మొదలైంది. రాత్రి వేళల్లో వాహనాలు నడిపే వారందరిదీ ఇదే అనుభవం

Published : 09 Dec 2021 02:41 IST

 వీధి దీపాల ఏర్పాటులో కొరవడిన శాస్త్రీయత

‘ఎదురుగా వచ్చే వాహనం వెలుతురుకు రహదారి కన్పించడం లేదు కదా.. బండిని ఎలా నడుపుతున్నావ్‌’ అని తన డ్రైవర్‌ను కారు యజమాని అడిగారు. ‘డ్రైవింగ్‌ అలవాటు కదా.. అందాదగా నడుపుతున్నా’ అని అనడంతో అతని గుండెల్లో వణుకు మొదలైంది. రాత్రి వేళల్లో వాహనాలు నడిపే వారందరిదీ ఇదే అనుభవం. నగరంలో నిశిరాత్రి చోటు చేసుకుంటున్న ప్రమాదాలకు సరైన వెలుతురు లేకపోవడం కూడా ఒక కారణం..
* నగర వ్యాప్తంగా రహదారులు, కాలనీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలు దేదీప్యమానంగా వెలిగిపోతుండగా.. ఎక్కువ చోట్ల సరైన వెలుతురు లేక  డ్రైవర్లకు కన్పించడం లేదు. తెలుపు ఎల్‌ఈడీ వీధి దీపాలు నీలికాంతిని విడుదల చేస్తాయి. గతంలో ఉపయోగించిన బల్బుల కంటే తక్కువ వెలుతురును ప్రసరిస్తాయి. ఇప్పుడు వాహనాల హెడ్‌ లైట్లు ఎల్‌ఈడీ కావడంతో డ్రైవర్లకు కష్టంగా మారింది.


ఇష్టారాజ్యంగా ఏర్పాటు...
ఎల్‌ఈడీ దీపాల వెలుతురు ఎక్కువ దూరం ప్రసరించదు. సామర్థ్యాన్ని బట్టి నిర్దేశిత ప్రదేశం వరకే వెలుగు  ఉంటుంది. స్తంభాలకు ఎంత ఎత్తులో దీపాలు ఏర్పాటు చేయాలి.? ఒక్కో స్తంభం మధ్య ఎంత ఎడం పాటించాలి అనేది అత్యంత కీలకం. కానీ నగరంలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటులో కొన్నిచోట్ల మినహా ఎక్కడా శాస్త్రీయత కన్పించడం లేదు. దీంతో స్తంభాల మధ్య అంధకారం, నీడ మాత్రమే కన్పిస్తూ వాహనదారులను భయపెడుతున్నాయి. ఇలాంటి చోట్ల గుంతలు ఉన్నా..పాదచారి రోడ్డు దాటుతున్నా వాహనదారు గుర్తించలేక పోతున్నారు. చెట్లు ఉంటే అంతే.  ్య సిటీలో గతంలో పాత వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలకే కొత్త ఎల్‌ఈడీ దీపాలు బిగించారు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. బల్బు సామర్థ్యం, స్తంభం ఎత్తును పరిగణనలోకి తీసుకోవాలి. సిటీలో 35 వాట్స్‌ నుంచి 70, 110, 190 వాట్స్‌ సామర్థ్యం కలిగిన దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ్య మూడు లేన్ల రహదారి ఉంటే ఎల్‌ఈడీ వెలుగులు ఏ మాత్రం సరిపోవడం లేదు.  


సోడియం వేపర్‌తో ఎక్కువ దూరం..

ఎల్‌ఈడీ దీపాలతో విద్యుత్తు ఆదా అవుతుంది. కాంతి ఎక్కువ ప్రసరిస్తుంది. కానీ కాంతిపుంజం వేరు. ఎక్కువ దూరంగా కన్పించదు. గతంలో ఉపయోగించిన సోడియం వేపర్‌ దీపాల్లో చాలా దూరం వరకు వెలుతురు ఉంటుంది. మబ్బుల్లో కూడా స్పష్టంగా కన్పిస్తుంది. దీన్ని బట్టి వీధి దీపాలకు ఏది మేలు అనేది నిర్ణయించుకోవచ్చు.

-యు.విద్యాసాగర్‌, హెడ్‌, ఇంధనం, విద్యుత్తు విభాగం, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాప్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని