logo
Published : 09/12/2021 02:41 IST

అక్రమ నల్లాలు, మురుగుతో ఆరోగ్యం గుల్ల!

ఇది ఒక స్కూల్‌ భవనం. కొంతకాలంగా అనుమతి లేకుండా తాగునీటిని వాడుకుంటున్నారు. గతంలో వివిధ కారణాలతో దీనికి జలమండలి అధికారులు నీటి కనెక్షన్‌ తొలగించారు. కొన్ని రోజుల తర్వాత అక్రమంగా నల్లా తీసుకొని తాగునీటిని వాడుకొంటూ మురుగునూ విడుదల చేస్తున్నారు. ఇది జలమండలి విజిలెన్సు దృష్టికి రావడంతో కనెక్షన్‌ తొలగించి క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.
ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో అక్రమ నల్లాలు, మురుగు కనెక్షన్లతో ప్రజారోగ్యం బేజారవుతోంది. వీటిపై జలమండలి కస్టమర్‌కేర్‌ నంబర్‌ 155313కు 300 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైనే హాట్‌స్పాట్‌లను అధికారులు గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. ్య   వాస్తవానికి నీటి కనెక్షన్‌తోపాటు జలమండలి మురుగు కనెక్షన్‌ కూడా ఇస్తుంది. నీటి ఛార్జీల్లో 33 శాతం అదనంగా మురుగు బిల్లు చెల్లించాలి. కొన్ని చిన్న పరిశ్రమల యూనిట్లు, వ్యాపార సంస్థలు మురుగు కనెక్షన్లు తీసుకోకుండా మురుగును జలమండలి లైన్లకు కలుపుతున్నారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్‌.బీ.నగర్‌, ఉప్పల్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి.ః నీటి బిల్లులు కట్టని నల్లాలను గతంలో జలమండలి తొలగించింది. అందులో చాలామంది తిరిగి కనెక్షన్లు ఏర్పాటు చేసుకొంటున్నారు.ః చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు అక్రమ కనెక్షన్లనే ఆశ్రయిస్తున్నాయి. రాత్రి పూట రోడ్డును అక్రమంగా తవ్వి మురుగు పైపులైన్‌ను జలమండలి లైన్లకు కలుపుతున్నారు. ః చాలా హోటళ్లు, రెస్టారెంట్లకు సిల్ట్‌ఛాంబర్లు ఉండటం లేదు. అక్రమ మురుగు కనెక్షన్ల ద్వారా హోటళ్లలోని చెత్త, వ్యర్థాలను ఈ పైపుల ద్వారా మురుగు గొట్టాల్లోకి వదులుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని