logo

‘విద్యుత్తు బిల్లును ఆమోదిస్తే దేశ వ్యాప్త సమ్మె’

కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సవరణ బిల్లు 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తే మరుక్షణమే దేశ వ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం ఖాయమని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ (టీఎస్‌పీఈ) జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు పేర్కొన్నారు. వెంటనే విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని

Published : 09 Dec 2021 02:41 IST

మింట్‌కాంపౌండ్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న రత్నాకర్‌రావు, మిత్ర సంఘాల నాయకులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సవరణ బిల్లు 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తే మరుక్షణమే దేశ వ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం ఖాయమని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ (టీఎస్‌పీఈ) జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు పేర్కొన్నారు. వెంటనే విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మింట్‌కాంపౌండ్‌లోని టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయం ఎదుట బుధవారం 14 మిత్ర సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లును వెనక్కు తీసుకోని పక్షంలో దేశంలోని 15 లక్షల విద్యుత్‌ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు.కార్యక్రమంలో వివిధ విద్యుత్తు సంఘాల నేతలు వేణు, కరుణాకర్‌రెడ్డి, నెహ్రూ, డా.చంద్రడు, శ్రీనివాస్‌, గోపాల్‌, మేడి రమేష్‌, ఈశ్వర్‌గౌడ్‌, నాగరాజు, తులసినాగరాణి తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న విద్యుత్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌, తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శివాజీ, తెలంగాణ రాష్ట్ర అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సెక్రెటరీ జనరల్‌ పి.అంజయ్య పేర్కొన్నారు. జాతీయ విద్యుత్తు ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం విద్యుత్తు సౌధాలో ధర్నా నిర్వహించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని