logo
Published : 11 Dec 2021 07:31 IST

Crime News: వామ్మో.. మలద్వారంలో 7.3 కిలోల బంగారం!


స్వాధీనం చేసుకున్న బంగారం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: విదేశాల నుంచి అడ్డదారిలో అక్రమ బంగారం తరలించడానికి స్మగ్లర్లు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం నలుగురు విదేశీ ప్రయాణికులు మల ద్వారంలో 7.3 కిలోల బరువు గల బంగారాన్ని తీసుకురావడంతో భద్రతాధికారులు అవాక్కయ్యారు. ఇటీవల భారీ స్థాయిలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి. శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూడాన్‌కు చెందిన ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు దుబాయ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో 7.3 కిలోల బంగారం బిస్కెట్లతో పాటు కరిగించి ముద్ద చేసిన బంగారాన్ని మలద్వారంలో పెట్టుకొని శంషాబాద్‌కు వచ్చారు. నలుగురు సూడాన్‌ దేశస్థులపై భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని క్షుణ్నంగా పరిశీలించినా బంగారం దొరకలేదు. వైద్యుల సహాయంతో మల ద్వారం వద్ద పరిశీలించగా బంగారం బయట పడింది. రూ.3.6 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని