logo

Hyderabad Metro: అన్నిటికీ ఒకటే కార్డు

మెట్రో, బస్సు, రైలు ప్రయాణాల టిక్కెట్లతోపాటు అన్ని రకాల చెల్లింపుల కోసం పేటీఎం ట్రాన్సిట్‌ కార్డును ప్రవేశపెట్టింది. త్వరలో ఇది మెట్రో రైళ్లలో చెల్లుబాటు కానుంది.

Published : 23 Dec 2021 09:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో, బస్సు, రైలు ప్రయాణాల టిక్కెట్లతోపాటు అన్ని రకాల చెల్లింపుల కోసం పేటీఎం ట్రాన్సిట్‌ కార్డును ప్రవేశపెట్టింది. త్వరలో ఇది మెట్రో రైళ్లలో చెల్లుబాటు కానుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థతో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మెట్రో స్టేషన్లలో ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) పాయింట్ల వద్ద ఈ కార్డు చూపించి ప్రయాణించవచ్చు. మున్ముందు బస్సులు, రైళ్లలోనూ ఇది చెల్లుబాటు కానుంది. అవసరాలన్నీ ఒకే కార్డుతో తీర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టినట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సజల్‌ భట్నాగర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, సీవోవో సుధీర్‌ చిప్‌లంకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని