logo

TS News: పథకం పాత పని మనిషిది.. అమలు కొత్తామెది

సినీ ఫక్కీలో జరిగిన ఓ చోరీని ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. అమీర్‌పేటలో వ్యాపారి వినోద్‌ పొద్దర్‌ ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది గతంలో పని చేసిన పనిమనిషి, ప్రస్తుత పని మనిషేనని గుర్తించారు.

Updated : 26 Dec 2021 08:33 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: సినీ ఫక్కీలో జరిగిన ఓ చోరీని ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. అమీర్‌పేటలో వ్యాపారి వినోద్‌ పొద్దర్‌ ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది గతంలో పని చేసిన పనిమనిషి, ప్రస్తుత పని మనిషేనని గుర్తించారు. వారితోపాటు సహకరించిన ఇద్దరిని అరెస్టుచేశారు. అమీర్‌పేట ధరంకరమ్‌రోడ్డులోని అంజనీటవర్స్‌లో ఫ్యాన్ల వ్యాపారి వినోద్‌ పొద్దర్‌ ఇంట్లో గురువారం చోరీ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో పని మనిషి అర్చనను విచారించగా తనపై దొంగలు దాడి చేశారని చెప్పింది. 39 తులాల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదు చోరీ అయిందంటూ వినోద్‌ ఫిర్యాదుచేశారు. పనిమనిషి అర్చనను అనుమానించిన పోలీసులు ఆమె ఫోన్‌ పరిశీలించారు. గతంలో ఆ ఇంట్లో పనిచేసి మానేసిన లక్ష్మితోపాటు గణేష్‌ అనే వ్యక్తితో ఎక్కుగా మాట్లాడినట్లు గుర్తించారు. అర్చనను విచారిస్తున్న సమయంలో గణేష్‌ అక్కడి నుంచి మాయమయ్యాడు. దీంతో పోలీసులు లక్ష్మిని తనదైన శైలిలో విచారించారు. సీసీకెమెరాలు పరిశీలించడంతో చోరీ గుట్టు తెలిసింది. చోరీకి పథక రచన చేసిన లక్ష్మి, దాడి జరిగినట్లు నటించిన అర్చన, గణేష్‌, అతని సూచనతో చోరీకి పాల్పడిన మిత్రుడు నవీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. హకీంపేటలో దాచిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని