logo

TS News: నాన్నను బతికించండి: చికిత్సకు విరాళాలు సేకరిస్తున్న కుమారులు

చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్న తమ తండ్రిని బతికించండి అంటూ ఇద్దరు కుమారులు పడుతున్న వేదన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం....

Updated : 30 Dec 2021 09:47 IST


చికిత్స పొందుతున్న హనుమాన్‌దాస్‌

 

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్న తమ తండ్రిని బతికించండి అంటూ ఇద్దరు కుమారులు పడుతున్న వేదన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు బత్తుల హనుమాన్‌దాస్‌, నిరంజని(42) పని నిమిత్తం ఈ నెల 24 సాయంత్రం ఘట్‌కేసర్‌ వెళ్లి బైకుపై వస్తున్నారు. సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు వద్ద సీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి మద్యం మత్తులో కారుతో దంపతులను ఢీకొట్టాడు. నిరంజని అక్కడికక్కడే చనిపోయింది. ఆ విద్యార్థిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హనుమాన్‌దాస్‌ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజూ రూ.50 వేలు ఖర్చవుతోందని, మూడు శస్త్రచికిత్సలకు రూ.15 లక్షలు- రూ.25లక్షలు అవుతుందని వైద్యులు చెప్పారని కుమారులు కల్యాణ్‌, మనీష్‌ తెలిపారు. తమకు అంత స్తోమత లేదని, ఆర్థిక సాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని