logo

Hyderabad News: 13 నెలలబిల్లులు మాఫీ!

గ్రేటర్‌ పరిధిలో గృహ నల్లాదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకంలో చేరినా.. చేరకపోయినా గత 13 నెలలకు సంబంధించి నీటి బిల్లులను మాఫీ చేసింది. ఈ మేరకు

Updated : 31 Dec 2021 07:49 IST

ఉచిత నీటి పథకంలో చేరినా చేరక పోయినా వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో గృహ నల్లాదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకంలో చేరినా.. చేరకపోయినా గత 13 నెలలకు సంబంధించి నీటి బిల్లులను మాఫీ చేసింది. ఈ మేరకు గురువారం పురపాలక శాఖ జారీ చేసిన మెమోలో స్పష్టం చేశారు. గ్రేటర్‌ వ్యాప్తంగా గృహ నల్లాలకు ఉచిత తాగునీరు వర్తింపజేసే పథకానికి ప్రభుత్వం 2020 డిసెంబరులో శ్రీకారం చుట్టింది. మొత్తం 9,84,023 లబ్ధిదారుల్లో గురువారం నాటికి సుమారు 5 లక్షల మంది నల్లాదారులు అనుసంధానం చేశారు. తాజాగా ప్రకటించిన మాఫీ.. కేవలం ఈ 13 నెలల బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా 20 వేల లీటర్లకు మాత్రమే. అంతకంటే ఎక్కువ వాడుకుంటే ఆ బకాయి బిల్లులు చెల్లించాలి. బకాయిలపై ఎలాంటి వడ్డీ, జరిమానాలు విధించరని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ఇది గ్రేటర్‌ వాసులకు తీపికబురే.ఉచిత పథకంలో చేరని వారికి జనవరి నుంచి తాగునీటి బిల్లులు అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని