logo

New Year 2022: ఒక్క నిమిషం.. 9,500 ఆర్డర్లు!

రోజూ చేస్తున్నాం.. ఈరోజూ వదిలిపెట్టరా.. అంటూ ఆవిడ అలక.. బయటికెళ్తే కొవిడ్‌ భయం ఇక్కడికే తెప్పిద్దామన్న ఆయన ముందుచూపు.. బిర్యానీయే కావాలంటూ పిల్లల

Updated : 02 Jan 2022 09:25 IST
ఆన్‌లైన్‌ డెలివరీల్లో స్విగ్గీ రికార్డు.. నగరానికి రెండోస్థానం
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రోజూ చేస్తున్నాం.. ఈరోజూ వదిలిపెట్టరా.. అంటూ ఆవిడ అలక.. బయటికెళ్తే కొవిడ్‌ భయం ఇక్కడికే తెప్పిద్దామన్న ఆయన ముందుచూపు.. బిర్యానీయే కావాలంటూ పిల్లల మారం.. అన్నీ కలిపి కొత్త ఏడాది అడుగెట్టిన వేళ ఆన్‌లైన్‌ ఆహార అగ్రిగేటర్ల రాతే మార్చేశాయి. ఎన్నడూ లేని విధంగా డిసెంబరు 31 అర్ధరాత్రి.. నిమిషానికి ఏకంగా 9500 ఆర్డర్లతో గత రికార్డుల్ని దాటేసింది స్విగ్గీ. 7100 ఆర్డర్లతో జొమాటో రెండో స్థానం దక్కించుకుంది. గతేడాది 2021 కొత్త ఏడాది వేడుకల్లో 5500 ఆర్డర్లు డెలివరీ చేసిన స్విగ్గీ ఈ ఏడాది పాత రికార్డును దాటేసింది. అత్యధిక ఆర్డర్లతో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. శుక్రవారం సాయంత్రం నుంచే హోటళ్లు కిటకిటలాడాయి.. పలు హోటళ్లు తెల్లవారుజామున 2, 3 గంటల దాకా ఆర్డర్లు అనుమతించడంతో ఆహార ప్రియులు ఆర్డర్లు పెట్టేశారు. 2014లో తొలిసారి నూతన సంవత్సర వేడుకల్లో భాగమైన స్విగ్గీ ప్రతి మూడు నిమిషాలకు ఒక్క ఆర్డర్‌ పొందిందని.. ఆరేళ్ల తర్వాత రికార్డు సాధించిందని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. చిన్న నగరాల్లో విశాఖపట్నం నిమిషానికి 190 ఆర్డర్లు పొందినట్లు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని