logo

TS News: హైదరాబాద్‌ తొలిపేరు భాగ్యనగర్‌ కాదు: చరిత్రకారులు

హైదరాబాద్‌ నగరానికి తొలి పేరు భాగ్యనగర్‌గా ప్రచారం చేస్తున్నారని, అది పొరపాటని పలువురు చరిత్ర కారులు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డెక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు నిర్వహించిన సమావేశంలో

Updated : 05 Jan 2022 06:57 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరానికి తొలి పేరు భాగ్యనగర్‌గా ప్రచారం చేస్తున్నారని, అది పొరపాటని పలువురు చరిత్ర కారులు పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డెక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్టు నిర్వహించిన సమావేశంలో చరిత్ర కారుడు కెప్టెన్‌ లింగాల పాండురంగారెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు కింగ్‌ షుక్‌ నాగ్‌, రీసెర్చ్‌ స్కాలర్‌ సయ్యద్‌ ఇనాముర్‌ రహ్మాన్‌ ఘూయుర్‌ మాట్లాడారు. 1590లో గోల్కొండలో ప్లేగు విజృంభించడంతో రాజు దర్బార్‌ ఖాళీ చేసి తన వారితో మూసీ నది దక్షిణాన విడిది ఏర్పాటు చేసుకున్నారని, అక్కడ వేడి అధికంగా ఉండటంతో పాటు, వారున్న ప్రాంతం ఇతరులకు కనిపించొద్దని అనేక తటాకాలు, తోటలు ఏర్పాటు చేయించారని వివరించారు. ఫ్రాన్స్‌కుచెందిన టావెర్నియర్‌ గోల్కొండను సందర్శించినపుడు అనేక తోటలు ఉండటాన్ని చూసి బాగ్‌నగర్‌గా(తోటల నగరం) పుస్తకంలో రాశాడని వివరించారు. ఖుతుబ్‌షాహీలు తయారుచేసిన నాణేలపైనా భాగ్యనగర్‌ పేరు కనిపించదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని