logo

Suicide:పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్య

పని ఒత్తిడితో బతకాలనిపించడం లేదంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కర్నూలు సోంశెట్టినగర్‌కు చెందిన ఆర్టీసీఉద్యోగి

Updated : 10 Jan 2022 09:47 IST

కిషోర్‌సింగ్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: పని ఒత్తిడితో బతకాలనిపించడం లేదంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కర్నూలు సోంశెట్టినగర్‌కు చెందిన ఆర్టీసీఉద్యోగి సత్యనారాయణసింగ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్న కుమారుడు బొందిలి రూప్‌కిషోర్‌ సింగ్‌(30) మాదాపూర్‌లోని జీయూఎస్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం కాలేదు. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ సీ బ్లాక్‌ సువర్ణ అపార్ట్‌మెంట్‌లో ఒక్కడే అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారు జామున 3.45 నిమిషాలకు కిషోర్‌ సింగ్‌ ఫ్యామిలీ గ్రూప్‌ వాట్సప్‌లో ఓ సంక్షిప్త సమాచారం పోస్టుచేశాడు. ఇప్పటివరకు మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి, నాకు పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక బతకాలనిపించడం లేదంటూ మెసేజ్‌ పెట్టాడు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే కొండాపూర్‌లో ఉంటున్న కిషోర్‌ స్నేహితుడు వేణుగోపాల్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. అతడు వెంటనే కిషోర్‌ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. లోపలినుంచి స్పందన లేకపోవడంతో అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ సహాయంతో తలుపులు తీసి చూడగా కిషోర్‌ ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని