logo

స్వాతంత్య్ర సమరయోధుడు, కవి టీవీ నారాయణ మృతి

స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్యసమాజ ప్రముఖుడు, పద్మశ్రీ గ్రహీత టీవీ నారాయణ(97) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. మాసాబ్‌ట్యాంక్‌

Published : 12 Jan 2022 03:36 IST

కార్వాన్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్యసమాజ ప్రముఖుడు, పద్మశ్రీ గ్రహీత టీవీ నారాయణ(97) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. మాసాబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌లో ఉంటున్నారు. నారాయణ భార్య టీవీ సదాలక్ష్మి మాజీ మంత్రి. ఈవిడ 2004లో మృతిచెందారు. నారాయణ ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో సభ్యుడిగా, ఎగ్జిబిషన్‌ సొసైటీలో ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ఈయనకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. బుధవారం బన్సీలాల్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు డా.వంశీతిలక్‌ తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని