logo

జైలుకెళ్తాడు.. వచ్చాక చోరీలు చేస్తాడు..!

ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన గందేశి శివకుమార్‌ను అరెస్టు చేసి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ తరుణ్‌జోషి శుక్రవారం

Published : 15 Jan 2022 00:52 IST

జగద్గిరిగుట్టకు చెందిన మెకానిక్‌ అరెస్టు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన గందేశి శివకుమార్‌ను అరెస్టు చేసి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ తరుణ్‌జోషి శుక్రవారం వెల్లడించారు. మెకానిక్‌గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడిన శివకుమార్‌ 2013 నుంచి 2016 వరకు సిద్ధిపేట, హైదరాబాద్‌ జిల్లాల్లో పలు ద్విచక్రవాహనాలు చోరీ చేశాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవించి 2016లో విడుదలయ్యాడు. 2019లో జనగామ, బచ్చన్నపేట, మట్టెవాడ ఠాణాల పరిధిలో ఏడు ద్విచక్ర వాహనాలను చోరీ చేయగా జనగామ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. గతేడాది జైలు నుంచి విడుదలై నవంబర్‌లో కేయూసీ, హనుమకొండ ఠాణా పరిధిలో రెండు ద్విచక్రవాహనాలను చోరీ చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. కేయూ క్రాస్‌రోడ్డులో చోరీ చేసిన ద్విచక్రవాహనాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు