logo

నిఘాలేకనే వేటగాళ్ల సంచారం

అధికారుల నిఘా లేకనే దామగుండం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఆగడాలు సాగుతున్నాయని స్థానిక రామలింగేశ్వర ఆలయ ఛైర్మన్‌ చంద్రశేఖËర్‌ పేర్కొన్నారు. గో పరిరక్షణ కమిటీ

Published : 15 Jan 2022 00:52 IST

పూడూరు, న్యూస్‌టుడే: అధికారుల నిఘా లేకనే దామగుండం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఆగడాలు సాగుతున్నాయని స్థానిక రామలింగేశ్వర ఆలయ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. గో పరిరక్షణ కమిటీ సభ్యులు, సత్యానంద స్వామితో కలిసి శుక్రవారం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధిని అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఆలయానికి చెందిన భూములు ఉన్నా, హద్దులు ఏర్పాటులో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పులు జరిపిన సంఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. లోతైన కందకాలు తీయటంతో  వన్యప్రాణులు అందులో పడి మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దామగుండం పరిరక్షణ కోరుతూ స్థానిక పోలీసు, దేవాదాయ కమిషనర్‌, హైకోర్టు న్యాయమూర్తికి లేఖల రాస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు