logo

అభివృద్ధి, ఆధ్యాత్మిక కేంద్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందనడానికి సీఎం కేసీఆర్‌ ఏడేండ్ల పాలనే నిదర్శనమని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌

Published : 15 Jan 2022 01:43 IST

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిన జీయర్‌ స్వామి

తెలంగాణ ప్రగతి 7 ఏళ్లలో 70 ఏళ్ల అభివృద్ధి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న   చిన జీయర్‌ స్వామి, చిత్రంలో

మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందనడానికి సీఎం కేసీఆర్‌ ఏడేండ్ల పాలనే నిదర్శనమని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి పేర్కొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ డా.యాదగిరిరావు రచించిన ‘ప్రగతి- 7 ఏళ్లలో 70 ఏండ్ల అభివృద్ధి కాఫీ టేబుల్‌’ శీర్షికతో 424 పేజీల గ్రంథాన్ని సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌,  మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి శుక్రవారం శ్రీరామనగరంలో స్వామి ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగడం అభినందనీయమన్నారు. దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా యాదాద్రిని రూపుదిద్దడం శుభ పరిణామం అన్నారు. భద్రాద్రి, రాజరాజేశ్వరస్వామి, వేములవాడ దేవాలయాలతో పాటు రాష్ట్రంలో చిన్న చిన్న ఆలయాల్లో నిత్య పూజలు జరిగేలా ముఖ్యమంత్రి కృషి చేయడంతో ఆధ్యాత్మిక లోకం ఆనందిస్తున్నారు.  యాదాద్రి, భద్రాద్రి, జోగులాంబ, రాజన్న దేవాలయాల పేర్లతో జిల్లాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. ఆలయాల అభివృద్ధి చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుందన్నారు. జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ.. ఏడేండ్ల పాలన సీఎం కేసీఆర్‌ కృషికి అక్షర దృశ్య రూపంగా ఈ కాఫీటేబుల్‌ గ్రంథం సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. జూపల్లి రామేశ్వర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దార్శనిక దృష్టికి ప్రతీకగా ప్రగతి గంథాన్ని ముద్రించడం సంతోషంగా ఉందన్నారు. రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కిషోర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని