logo

కాళీ కమాన్‌ మార్కెట్‌లో చైనా మాంజా స్వాధీనం

నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువైన వివిధ

Published : 15 Jan 2022 01:43 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్సు పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువైన వివిధ రకాల మాంజా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుల్జార్‌హౌజ్‌లోని కాళీ కమాన్‌ ప్రాంతంలో చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసుల బృందం మార్కెట్‌లో దాడులు నిర్వహించింది. నిందితులు మహ్మద్‌ రిజ్వాన్‌(41), అబ్దుల్‌ ఖాదర్‌(42), మహ్మద్‌ సాబేర్‌(21) పట్టుబడ్డారు. మాంజాను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నిందితులను మీర్‌చౌక్‌ పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని