logo

ప్రసవం ముంగిట కరోనా పరీక్ష

కరోనా మళ్లీ విజృంభిస్తోన్న తరుణంలో గర్భిణుల ఆరోగ్యంపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసవానికి ముందు కరోనా పరీక్షలు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. అవసరమైతే ఇళ్లవద్దకు వెళ్లిగానీ, లేదంటే ఏఎన్‌ఎం

Published : 15 Jan 2022 01:43 IST

గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మళ్లీ విజృంభిస్తోన్న తరుణంలో గర్భిణుల ఆరోగ్యంపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రసవానికి ముందు కరోనా పరీక్షలు చేయాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. అవసరమైతే ఇళ్లవద్దకు వెళ్లిగానీ, లేదంటే ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ సాయంతో సమీప వైద్యకేంద్రంలో చేయించాలని అనుకుంటున్నారు. కరోనా ఉన్నట్లు తేలితే వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ప్రసవం తర్వాత తల్లి, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు 5 వేల ప్రసవాలు జరుగుతాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రభావితులవుతున్నారు. గ్రేటర్‌లో 5 రోజుల వ్యవధిలోనే 5 వేల కేసులు నమోదయ్యాయి. గర్భిణులకు ముప్పు పొంచి ఉంది. మిగతా వారితో పోల్చితే వీరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ. వైరస్‌ సోకితే పుట్టే శిశువుకూ ఇబ్బందే. ఇప్పటికే గాంధీలో 15 మంది గర్భిణులు కరోనాతో చేరగా వైద్యులు పురుడు పోశారు. ప్రసవానికి ముందే పరీక్షలు చేసి.. కరోనా ఉన్నట్లు తేలితే గాంధీకి పంపుతున్నారు. ప్రసవ తేదీకి 48గంటల ముందు ఈ పరీక్షలు చేస్తే మరింత అప్రమత్తంగా ఉండవచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణుల నమోదు, అవగాహనను ఎప్పటికప్పుడు ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌లు చేపడుతున్నారు. తల్లి శిశువుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ జిల్లా నగర వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు.


మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే..

ర్భిణులను ప్రత్యేక గదిలో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడుకలకు వెళ్లడం, ఇతరులను కలుసుకోవడం తగ్గించుకోవాలంటున్నారు. వారు వాడే ప్రతి వస్తువును ప్రత్యేకంగా ఉంచాలి. ప్రత్యేక స్నానపుగది లేకపోతే, ఇతరులు వాడాక సోడియం హైపో క్లోరైట్‌ ఉండే క్లీనర్‌తో శుభ్రం చేయాలి. ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించాలి. ప్రసవ తేదీ కంటే ముందే, జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు బట్టి మందులు వాడాలి. కరోనా సోకినా చాలామంది ఇంటి వద్దే ఉంటూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఐదారు రోజులపాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్‌ తగ్గడం లాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు