Ts News: రాజ్‌భవన్‌లో అట్టహాసంగా సంక్రాంతి సంబురాలు

రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబేరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా రాజ్‌భవన్‌ ఆవరణలో పాలు పొంగించి పొంగలి...

Updated : 15 Jan 2022 16:05 IST

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబేరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కుటుంబ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా రాజ్‌భవన్‌ ఆవరణలో పాలు పొంగించి పొంగలి వండి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో నిరంతరం కష్టపడుతున్న రైతులకు నా అభినందనలు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలు సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యుల అభినందనీయం. కొవిడ్ బారినపడకుండా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే భౌతిక దూరం పాటిస్తూ విధిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా బూస్టరు డోస్ అందుబాటులో లేదు. అలాంటిది భారతదేశంలో బూస్టరు డోస్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలంతా తప్పకుండా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగించుకోవాలి’’ అని గవర్నర్ పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని