logo

సైబర్‌ నేరాలపై నిరంతరం అప్రమత్తం: ఎస్పీ

అంతర్జాలంలో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి వారి వలలో పడకుండా చూసుకోవాలని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. సైబర్‌ నేరగాళ్ల పంథా ఎప్పటికప్పుడు మారుతోందని తక్కువ ధరకే వాహనం,

Published : 17 Jan 2022 03:27 IST

వికారాబాద్‌, న్యూస్‌టుడే: అంతర్జాలంలో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి వారి వలలో పడకుండా చూసుకోవాలని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. సైబర్‌ నేరగాళ్ల పంథా ఎప్పటికప్పుడు మారుతోందని తక్కువ ధరకే వాహనం, సత్వర రుణం, ఆరోగ్యకార్డులు, లాటరీ వచ్చిందని, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం, బ్యాంకు ప్రతినిధినంటూ ఖాతా వివరాలు, ఓటీపీ లాంటివి అడుగుతూ క్షణాల్లో సొమ్ములు కాజేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైం.జీఓవీ. ఇన్‌లో ఫిర్యాదు చేయాలని, టోల్‌ ఫ్రీ సంఖ్యలు 155260, 100 డయల్‌, 112లకు ఫోన్‌ చేయాలని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, యువత సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించుకొని ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. సైబర్‌ నేరస్థులు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని, నగదు భద్రంగా ఉండాలంటే బాధితులు వేగంగా స్పందించాలన్నారు. ఓటీపీ నంబర్లు చెప్పడం, ఇతర వివరాలను సైబర్‌ నేరస్థులతో పంచుకోవడం, కొన్ని సందర్భాల్లో ఈ-మెయిల్‌కు వచ్చిన సమాచారాన్ని నిజమైనదిగా భావించి, త్రీడీ పిన్‌ నంబరును నేరగాళ్లకు ఇవ్వొద్దన్నారు. చరవాణితో డబ్బు పంపుతున్నప్పుడు ఈ-వ్యాలెట్‌ ఖాతాలను నిర్వహిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని