logo

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ: ఒకరి మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణ గాంధీనగర్‌ ఔరంగాబాద్‌ క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ పట్టణ నవాబుపేటకు చెందిన

Published : 17 Jan 2022 05:01 IST

మెదక్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణ గాంధీనగర్‌ ఔరంగాబాద్‌ క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ పట్టణ నవాబుపేటకు చెందిన బొప్పని బీరప్ప (45) కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ద్విచక్ర వాహనంపై మెదక్‌ నుంచి వాడీ గ్రామానికి బయలుదేరాడు. పంచముఖి హనుమాన్‌ దేవాలయం నుంచి హవేలిఘనాపూర్‌ వైపు వెళ్లేందుకు ఔరంగబాద్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ప్రదాన రహదారి పైకి వస్తున్నాడు. అదే సమయంలో హవేలిఘనాపూర్‌ నుంచి మెదక్‌ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న రాఘవపల్లి గ్రామానికి చెందిన నార్ల రాజు ఢీ కొట్టాడు. దీంతో బీరప్ప కిందపడిపోగా తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాజుకు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.


ఆటో ఢీకొని, పడిపోయిన యువకుడిని చిదిమేసిన లారీ

చేర్యాల, న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాలు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుందామని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ముగ్గురు కూతుళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాదం నింపింది. ఎస్సై చంద్రమోహన్‌, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. చేర్యాల మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన కొమ్ము అజయ్‌కుమార్‌(18) గత కొన్నాళ్లుగా కొమురవెల్లి మండల కేంద్రంలోని మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. పండుగ రోజు మధ్యా హ్నం వరకు పని చేశాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా కొమురవెల్లి దాటాక రసూలాబాద్‌ శివారులో ఎదురుగా వేగంగా మరో వా హనాన్ని దాటి వస్తున్న ఆటో ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం ఒకవైపు, అజయ్‌ రోడ్డుపై పడిపోయాడు. ద్విచక్ర వాహనం వెనుకాల వస్తున్న లారీ.. యువకుడి పైనుంచి దూసుకెళ్లింది. రోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని