logo

గతంలో మూణ్నెళ్ల ముందే సంక్రాంతి సందడి: తలసాని

గతంలో సంక్రాంతి పండుగకు మూడు నెలల ముందు నుంచే సందడి కనిపించేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తాను స్వయంగా పతంగులు తయారు చేసి ఎగురవేసేవాడినని చెప్పారు. ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి వల్ల మన పండుగలు, సంప్రదాయాలు మర్చిపోయే

Published : 17 Jan 2022 05:33 IST


పీపుల్స్‌ ప్లాజాలో పతంగి ఎగురవేస్తున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: గతంలో సంక్రాంతి పండుగకు మూడు నెలల ముందు నుంచే సందడి కనిపించేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తాను స్వయంగా పతంగులు తయారు చేసి ఎగురవేసేవాడినని చెప్పారు. ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతి వల్ల మన పండుగలు, సంప్రదాయాలు మర్చిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా శనివారం పీపుల్స్‌ ప్లాజాలో కైట్‌ ఫెస్టివల్‌లో పతంగులు ఎగురవేశారు. రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 24 గంటల విద్యుత్తు, రైతు బంధు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆయన వెంట తెరాస నాయకులు గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌, బాలరాజు యాదవ్‌, శైలేందర్‌, బాబూరావు, ప్రవీణ్‌రెడ్డి, సురేష్‌గౌడ్‌, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని