logo

ఉరిమిన వరుణుడు

నగరాన్ని పండగ పూట అకాల వర్షం ముంచెత్తింది. శనివారం కాప్రా, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, మల్కాజిగిరి, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం పూట భారీగా కురిసింది. కాప్రాలో రికార్డు స్థాయిలో 11.6 సెం.మీ. వానపడిందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

Published : 17 Jan 2022 05:33 IST

వరద ప్రవాహం వల్ల ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి పొంగుతున్న నాలా

ఈనాడు, హైదరాబాద్‌: నగరాన్ని పండగ పూట అకాల వర్షం ముంచెత్తింది. శనివారం కాప్రా, ఉప్పల్‌, సరూర్‌నగర్‌, మల్కాజిగిరి, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం పూట భారీగా కురిసింది. కాప్రాలో రికార్డు స్థాయిలో 11.6 సెం.మీ. వానపడిందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. నాచారంలో 11.3 సెం.మీ, ఉప్పల్‌ చిలుకానగర్‌లో 10 సెం.మీ. వానపడింది. యాఖుత్‌పురా, రెయిన్‌ బజార్‌, డబిర్‌పురలో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో వారంరోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రోజంతా మేఘావృతమై ఉంటోంది. ఆదివారం సైతం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని