logo

నిర్మాణరంగ కోర్సుల్లో శిక్షణ

గ్రామీణ నిరుద్యోగ యువతకు మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో నిర్మాణ రంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశం కల్పించనున్నారు. ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌, పెయింటర్‌, జేసీబీ ఆపరేటింగ్‌,

Published : 17 Jan 2022 05:33 IST

మాదాపూర్‌, న్యూస్‌టుడే: గ్రామీణ నిరుద్యోగ యువతకు మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో నిర్మాణ రంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశం కల్పించనున్నారు. ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌, పెయింటర్‌, జేసీబీ ఆపరేటింగ్‌, లాండ్‌ సర్వేయర్‌, సూపర్‌వైజర్‌, స్టోర్‌కీపర్‌ కోర్సుల్లో 3 నెలలు ఉచిత వసతి కల్పించి ఆయా రంగ నిపుణులతో శిక్షణ ఇస్తారు. అనంతరం నిర్మాణ రంగానికి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు వంద రోజుల జాబ్‌కార్డు, పదోతరగతి మెమో, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర పత్రాలతో మాదాపూర్‌లోని న్యాక్‌ కార్యాలయానికి రావాలి. వివరాలకు ఫోన్‌ నంబర్లు 9032504507, 9866451251 నంబర్లలో సంప్రదించాలని న్యాక్‌ ట్రేనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్‌ విభాగం డైరెక్టర్‌ శాంతిశ్రీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు