logo

Crime News: రంగారెడ్డి జిల్లా యాచారంలో మళ్లీ చిరుతపులి కలకలం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం రేగింది.

Updated : 17 Jan 2022 12:21 IST

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం రేగింది. గతవారం నానక్‌నగర్‌లో ఓ మేకను చంపి తిన్న చిరుత.. తాజాగా మరో ఆవు దూడపై దాడి చేసింది. మండలంలోని పిల్లిపల్లి గ్రామంలో భిక్షపతి అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఆవు దూడపై దాడి చేసి చంపి తిన్నది. వారం రోజుల వ్యవధిలోనే రెండు మూగజీవాలపై చిరుత దాడి చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా మేడిపల్లి -కొత్తపల్లి, తాడిపత్రి గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో వరుస చిరుత దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి చేసినప్పుడు అటవీ అధికారులు రావటం.. తాత్కాలికంగా బోనులు ఏర్పాటు చేయడం.. తర్వాత వెళ్లిపోవడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస చిరుత దాడులతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని వాపోతున్నారు. ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వణుకుపుడుతోందని.. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని