logo

విద్యుదాఘాతంతో యువకుడి మృత్యువాత

వ్యవసాయ క్షేత్రానికి కాపలా ఉంటున్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు బోరు మోటారు తీగలను సరి చేస్తూ మృత్యువాత పడిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చేసింది. శామీర్‌పేట పోలీసులు,

Published : 18 Jan 2022 02:25 IST

ఆందోళన చేస్తున్న మృతుని బంధువులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్న సీఐ

శామీర్‌పేట, జగదేవ్‌పూర్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ క్షేత్రానికి కాపలా ఉంటున్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు బోరు మోటారు తీగలను సరి చేస్తూ మృత్యువాత పడిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చేసింది. శామీర్‌పేట పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన తుమ్మయాదగిరి కుటుంబం.. ఉపాధి నిమిత్తం మల్కాజ్‌గిరి జిల్లా తూంకుంటకు వలస వచ్చింది. ఓంప్రకాశ్‌గుప్తా వ్యవసాయ క్షేత్రంలో ఆరేళ్ల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. యాదగిరి చిన్న కుమారుడు తుమ్మ సంజీవ(24) స్థానికంగా పనులు చేసుకుంటూ వ్యవసాయ క్షేత్రంలో తండ్రితో ఉంటున్నాడు. ఈనెల 16న పశువులకు నీరు లేకపోవటంతో బోరు ఆన్‌ చేసేందుకు వెళ్లగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. శామీర్‌పేట ఎస్సై వీరశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. భూ యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని సంజీవ బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుని కుటుంబానికి భూ యజమానితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ సుధీర్‌కుమార్‌  హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని