logo

నేరాల నియంత్రణకు సైబర్‌ల్యాబ్‌

పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు జిల్లాలో సైబర్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. సోమవారం పరిగి పోలీసు స్టేషన్‌ను

Published : 18 Jan 2022 02:25 IST

జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి

పరిగి: పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు జిల్లాలో సైబర్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి తెలిపారు. సోమవారం పరిగి పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధితులెవరైనా 100 టోల్‌ ఫ్రీ నంబరుకు 24 గంటల్లో ఫిర్యాదు చేయవచ్చని లేదా సమీప పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. పూడూరు మండలంలో ఇటీవల జరిగిన సైబర్‌ నేరం పట్ల కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని స్వచ్ఛంద సంస్థల సహకారంతో తగ్గించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని చెప్పారు. గంజాయి, గుట్కాల నియంత్రణపై ఉక్కుపాదం మోపుతామని రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా భద్రతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తామని ఇందుకు ప్రజా సహకారం ఎంతో అవసరమని చెప్పారు. పరిగిలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకించి సిబ్బందిని ఏర్పాటు చేయాలని ‘న్యూస్‌టుడే’ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లగా ఇందుకోసం తెలుపు డ్రస్సు కోడ్‌ను అమలు చేస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేలా చూడాలని స్థానిక డీఎస్పీ శ్రీనివాస్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ వెంకట్రామయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని