logo

టీకా పంపిణీపై పాలనాధికారిణి సమీక్ష

రెండో డోసు వ్యాక్సినేషన్‌ తీసుకునే గడువు పూర్తి అయిన వారిని ఉప కేంద్రాల వారిగా గుర్తించి టీకాలు ఇవ్వాలని కలెక్టర్‌ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం

Published : 18 Jan 2022 02:25 IST

దృశ్య మాధ్యమం ద్వారా వివరిస్తున్న కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రెండో డోసు వ్యాక్సినేషన్‌ తీసుకునే గడువు పూర్తి అయిన వారిని ఉప కేంద్రాల వారిగా గుర్తించి టీకాలు ఇవ్వాలని కలెక్టర్‌ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. జిల్లాలో రెండో డోసుకు అర్హులైన వారు 68,161 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, పర్యవేక్షకుల సహకారంతో ఇంటింటికి తిరిగి వారికి టీకా ఇవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు మొదటి డోసు 103 శాతం, రెండో డోసు 51 శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గృహ నిర్బంధ]ంలో ఉన్న వారికి పంపిణీ చేసే కిట్స్‌, కొవిడ్‌ పరీక్షల కిట్స్‌లను అన్ని ఉప కేంద్రాల్లో  అందుబాటులో ఉంచామన్నారు. 15 నుంచి 17ఏళ్ల లోపు ఉన్న యువతకు 31 శాతం టీకా ఇచ్చామన్నారు. 4,370 మంది ఆరోగ్య కార్యకర్తల్లో 1,363 మందికి, 5,796 ఫ్రంట్‌లైన్‌ వర్కర్లల్లో 423 మందికి బూస్టర్‌ డోసు, 60 ఏళ్లు దాటిన వారు 60,860 మంది ఉండగా 379 మందికి ముందస్తు జాగ్రత్త టీకా వేశామని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌, ఉప వైద్యాధికారులు జీవరాజ్‌, ధరణికుమార్‌, కార్యక్రమ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని