logo

పాజిటివ్‌.. పైపైకి!

భాగ్యనగరం కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. మొదటి, రెండో దశల కంటే అధిక స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మహమ్మారి జడలు విప్పుతోంది. బస్తీలు, గల్లీలు, కాలనీలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరుగుతున్నాయి. ప్రధాన నగరంలో పాజిటివ్‌ శాతం సరాసరి 13 దాటింది. అంటే పరీక్షలకు వస్తున్న ప్రతి వందమందిలో 13 మందికి కరోనా ఉంటోంది.  ఇది కొన్ని ప్రాంతాల్లో 50...

Published : 18 Jan 2022 02:25 IST

పలుచోట్ల 40-50 శాతం వరకు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: భాగ్యనగరం కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. మొదటి, రెండో దశల కంటే అధిక స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మహమ్మారి జడలు విప్పుతోంది. బస్తీలు, గల్లీలు, కాలనీలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల కేసుల సంఖ్య భారీ ఎత్తున పెరుగుతున్నాయి. ప్రధాన నగరంలో పాజిటివ్‌ శాతం సరాసరి 13 దాటింది. అంటే పరీక్షలకు వస్తున్న ప్రతి వందమందిలో 13 మందికి కరోనా ఉంటోంది.  ఇది కొన్ని ప్రాంతాల్లో 50 శాతంపైనే నమోదు కావడం గమనార్హం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతోనే వ్యాప్తి భారీగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీలో 1,112 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే సోమవారం నగరంలోని వివిధ నోడల్‌ కేంద్రాల పరిధిలో 10 వేలకు పైగా ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులు నిర్వహించగా.. అందులో 1397 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.  

ప్రధాన నగరంలోనే..
ప్రధాన నగరంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్‌ శాతం భారీ స్థాయిలో నమోదు అవుతోంది. తీవ్ర లక్షణాలు లేకపోవడం వల్ల ఆసుపత్రిలో చేరే వారి శాతం తక్కువే. నిర్లక్ష్యంగా ఉంటే ముప్పు తప్పదని వైద్యులు చెబుతున్నారు. పెద్దఎత్తున కేసులు నమోదైతే...2 శాతం మంది ఆసుపత్రి పాలైనా ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, పడకలు కూడా సరిపోని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు.


ఇంట్లో ఒకరికి సోకితే అందరికి...

ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఒక్కరికి సోకినా...మిగతా వారందరికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. చిన్న పిల్లల్లో సైతం లక్షణాలు కన్పిస్తున్నాయి. ఎక్కువ మందికి జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతులో గరగర, పొడి దగ్గు లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొందరికి తొలుత జలుబు, దగ్గుతో మొదలవుతోంది. 2-3 రోజులపాటు పరీక్షలు చేయించుకోకుండా అలానే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో అందరికి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించామని ఓ వైద్యుడు తెలిపారు. తన వద్దకు వచ్చే వారిలో నిత్యం 10-20 మంది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఉంటారన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని