logo

స్వీయ వైద్యం.. తెచ్చుకోవద్దు అనర్థం

అత్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. వరుసగా రెండు రోజులపాటు వంద డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, ఇతరత్రా లక్షణాలు ఉండటంతో వైద్యుడిని సంప్రదించకుండా అజిత్రోమైసిన్‌తోపాటు మరో రెండు రకాల యాంటీబయాటిక్‌ మందులను ఇష్టానుసారంగా వేసుకున్నారు. దీంతో మందుల డోసు అధికమై ఆరోగ్యం విషమించడంతో నాలుగోరోజు అతన్ని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది.

Published : 18 Jan 2022 02:25 IST

డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడొద్దు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

* అత్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. వరుసగా రెండు రోజులపాటు వంద డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, ఇతరత్రా లక్షణాలు ఉండటంతో వైద్యుడిని సంప్రదించకుండా అజిత్రోమైసిన్‌తోపాటు మరో రెండు రకాల యాంటీబయాటిక్‌ మందులను ఇష్టానుసారంగా వేసుకున్నారు. దీంతో మందుల డోసు అధికమై ఆరోగ్యం విషమించడంతో నాలుగోరోజు అతన్ని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది.

హానగరంలో వైరస్‌ బారినపడిన వేలాది మంది ఇప్పుడు సొంత వైద్యం బాట పట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేకమంది రెండు దశల్లో మహమ్మారి సోకినప్పుడు వాడిన మందులనే ఇప్పుడు వాడేస్తున్నారు. ఇలా సొంతగా వాడటం ఆరోగ్యపరంగా మంచిది కాదని దాని వల్ల ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

స్వల్ప లక్షణాలే అని..
ప్రస్తుతం వైరస్‌ సోకినవారిలో చాలామందికి పెద్దగా లక్షణాలు ఉండటం లేదు. స్వల్పంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం ఉంటున్నాయి. ఇలా ఉండి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే వైద్యుడ్ని సంప్రదించి మందులు వాడితే ఆరేడు రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి. నాలుగు రోజులపాటు జ్వరం అలాగే ఉన్నా ఆక్సిజన్‌ 94 శాతం కంటే మాత్రం తగ్గితే వెంటనే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు కోరుతున్నారు.  


పర్యవేక్షణ ఉండాల్సిందే
డా.ఎంవీరావు, ప్రముఖ ఫిజీషియన్‌, యశోదా ఆస్పత్రి

వైరస్‌ ఉన్నట్లు తేలిన వారు కచ్చితంగా వైద్యులు పర్యవేక్షణలోనే మందులు వాడాలి. ఆక్సిజన్‌ 95 శాతానికి పైబడి ఉండి పెద్దగా లక్షణాలు లేని వారు ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండి వైద్యుల ఫోన్‌ పర్యవేక్షణలో చికిత్స పొందొచ్చు. డెల్టావేరియంట్‌ బారినపడి లక్షణాలు అధికంగా ఉన్న వారికి తొలిదశలోనే ఆస్పత్రిలో చేరితే మోనో క్లోనల్‌ యాంటీబాడీస్‌ వాడితే చాలా వరకు రోగులు కోలుకుంటున్నారు. ఒమిక్రాన్‌ అయితే రెమ్‌డెసివిర్‌ వినియోగిస్తే సరిపోతుంది. ఇవి రెండూ ప్రారంభ దశలోనే లక్షణాలు అధికంగా ఉన్నవారికి అదీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఇవ్వాల్సి ఉంటుంది. యాంటీ బయాటిక్స్‌ మందులతోపాటు జింక్‌, విటమిన్‌ మందులు అధికంగా వాడటం సరికాదు. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని