logo

పండక్కి ఊరెళ్తే.. ఇళ్లల్లో చోరీలు

పండక్కి ఊరెళ్లి వచ్చేసరికి వరుసగా 3 ఇళ్లలో చోరీలకు పాల్పడి 31.6 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, 1.97 లక్షల నగదును దోచుకెళ్లారు దుండగులు. జగద్గిరిగుట్ల పోలిసుల వివరాల ప్రకారం.. దేవేందర్‌ నగర్‌ పరిధి

Published : 18 Jan 2022 02:24 IST

రంగారెడ్డి నగర్‌ న్యూస్‌టుడే: పండక్కి ఊరెళ్లి వచ్చేసరికి వరుసగా 3 ఇళ్లలో చోరీలకు పాల్పడి 31.6 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, 1.97 లక్షల నగదును దోచుకెళ్లారు దుండగులు. జగద్గిరిగుట్ల పోలిసుల వివరాల ప్రకారం.. దేవేందర్‌ నగర్‌ పరిధి రావినారాయణరెడ్డి నగర్‌లో వరుసగా 6 ఇళ్ల తాళాలు పగలగొట్టిన దొంగలు 3 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. నడిపల్లి రాంబాబు, లింగస్వామి, వెంకటరమణ, శేఖర్‌, నక్క వెంకటేష్‌, బక్కిని పాండురంగ వీరంతా రావినారాయణరెడ్డినగర్‌లో నివాసముంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సంక్రాంతికొ సొంతూళ్లకు వెళ్లారు. సోమవారం వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. నక్క వెంకటేష్‌ ఇంట్లో 25 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. పాండురంగ ఇంట్లో 4 తులాల బంగారు, 25 తులాల వెండి ఆభరణాలు, రూ.47 వేల నగదు మాయమయ్యాయి. నడిపల్లి రాంబాబు ఇంట్లో 6 గ్రాముల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి.

ఒకే కాలనీలో మరో నాలుగిళ్లు గుల్ల

తుర్కయాంజాల్‌, న్యూస్‌టుడే: తుర్కయాంజాల్‌  రాగన్నగూడ లక్ష్మీమెగా టౌన్‌షిప్‌ కాలనీలో ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్‌, గిరి, ఝాన్సీలు సంక్రాంతి నేపథ్యంలో  ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లారు. సోమవారం వచ్చి చూడగా ఇంటి తాళాలతో పాటు బీరువాల తాళాలూ పగులగొట్టి కనిపించాయి. ఈ ఘటనలో మొత్తం 7.5 తులాల బంగారం, రూ.12 వేల నగదు చోరీకి గురయ్యిందని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, సీఐ నరేందర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని