logo

రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంపై పసికందు

రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని దంపతులు వదిలివెళ్లిన రోజుల పసికందుని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు గుర్తించి శిశు విహార్‌కు తరలించారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీను

Published : 18 Jan 2022 02:24 IST

ఛైల్డ్‌లైన్‌కు అప్పగింత

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని దంపతులు వదిలివెళ్లిన రోజుల పసికందుని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు గుర్తించి శిశు విహార్‌కు తరలించారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీను కథనం ప్రకారం... సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని 2, 3 ప్లాట్‌ఫాంల మధ్యలో ముక్కుపచ్చలారని 20రోజుల పసికందు ఏడుస్తుండగా ఓ టీటీ గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు పాపను పరిశీలించారు. సంబంధీకులు ఎవరూ కనిపించకపోవడంతో పసికందును 1098 చైల్డ్‌లైన్‌ దివ్యదిశ సిబ్బందికి అప్పగించి శిశు విహార్‌కు తరలించారు. 30, 35 సంవత్సరాల వయసులో ఉన్న దంపతులు ఆ పాపను తీసుకు వచ్చారని, అక్కడే కొంతసేపు ఉన్న మహిళ పాపకు పాలు కూడా ఇచ్చినట్లు ప్లాట్‌ఫాంను ఊడ్చే క్రమంలో స్లీపర్లు గుర్తించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో కూడా ఆ విషయం గుర్తించారు. స్పష్టత లేకపోవడంతో మరికొన్ని సీసీ కెమెరాలను పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపడుతామని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని