logo

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై నాగరాజు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన శశాంక్‌ చౌదరి (30) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.

Published : 18 Jan 2022 06:41 IST

మియాపూర్‌, న్యూస్‌టుడే: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్సై నాగరాజు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన శశాంక్‌ చౌదరి (30) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆయన  మియాపూర్‌ మయూరి నగర్‌లో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కొద్దిరోజులుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాహంపై చర్చించారు. తల్లి సోమవారం ఉదయాన్నే అతని పడక గదిలోకి వెళ్లి చూసేసరికి ఉరివేసుకుని కనిపించాడు. ఆరోగ్యం సరిగా లేక చనిపోతున్నానని అతని డైరీలో రాసి ఉందని ఏఎస్సై నాగరాజు తెలిపారు.


కరోనా భయంతో ఆటోడ్రైవర్‌..

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: కరోనా సోకడంతో భయాందోళనకు గురైన ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింహాస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రేణుకానగర్‌కు చెందిన ఎలన్‌ ఎడ్వర్డ్‌ ఆంథోని(49)కి భార్య, 12, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని వారాల కిందట భార్య, బిడ్డలు కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. మూడు రోజుల క్రితం ఆంథోనికి పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. కరోనా కారణంగా బతకలేననే భయంతో ఆదివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు